కార్యక్రమంలో ఎంపీ ఆనంద్ గారు మాట్లాడుతూ పిల్లలకు విద్యతోపాటు, ఇలా ప్రతి సంవత్సరం అన్ని పండుగలను వాళ్ళకి తెలియజేసి ఆటపాటలు మరియు వేషధారణలతో పండగల యొక్క తాత్పర్యం అర్థమయ్యే విధంగా తెలియజేయడంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపీ ఆనందన్ గారు, పాలనాధికారులు డాక్టర్ జి వి ఎస్ బాబు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ కృష్ణ చరణ్ గారు, జనరల్ సెక్రెటరీ ఏ కవితా రాణి గారు, ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, మరియు చిన్నారులు పాల్గొన్నారు.