National Women Teacher’s day
జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి 192వ జయంతి వేడుకలు
చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ లో వైభవంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు శ్రీ ఎంపీ ఆనందన్ గారి అధ్యక్షతన జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా సెక్రెటరీ కవిత రాణి గారు మాట్లాడుతూ స్త్రీజాతికి వన్నె తెచ్చి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా చరితకెక్కిన గొప్ప సంఘసంస్కర్త రచయిత్రి ఉపాధ్యాయుని ఆమె జీవితం స్త్రీ జాతికే స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని చిరంజీవి ఐశ్వర్య సావిత్రిబాయి పూలే వేషధారణ మరియు ప్రసంగం ఆకట్టుకుంది. సంస్థ పాలనాధికారి డాక్టర్ జి. సుబ్రహ్మణ్యం బాబు గారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్త్రీల కోసం తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను స్థాపించి విద్యనందించిన ధీర వనిత ఎన్నో అవమానాలను లెక్కలేని అడ్డంకులను అధిగమించి మహిళా మండలి స్థాపించి వితంతువులకు గుండు గీసే దురాచారాన్ని చురుకుల చేత సమ్మె చేయించి నిర్మూలింప చేసి సతీసహగమనాన్ని వ్యతిరేకించి వితంతు వివాహాలు ప్రోత్సహించా రు.చివరిగాతన భర్త చనిపోతే తానే అంత్యక్రియలు చేసి నవ సమాజానికి నాంది పలికిన విప్లవకారునికి 192వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మిస్ట్రెస్ గిరిజమ్మాల్ కరస్పాండెంట్ కృష్ణ చరణ్ ఉపాధ్యాయుని బృందం సుభాషిని, పుష్పవతి రెడ్డి లక్ష్మి పల్లవి మరియు ఉపాధ్యాయ బృందం సురేంద్ర శంకరయ్య పాల్గొన్నారు.
విద్యార్థిని విద్యార్థుల ప్రసంగములు మరియు గేయాలతో అలరించారు. జాతీయగీత ఆలాపనతో కార్యక్రమం జయప్రదంగా ముగిసినది.