చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నందు అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చైతన్య స్వచ్చంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపి ఆనంద్ గారు, అడ్మినిస్ట్రేటివ్ డాక్టర్ జి వి ఎస్ బాబు గారు, జనరల్ సెక్రెటరీ కవిత రాణి గారు, ముత్తు ఆంగ్ల మాధ్యమ చిన్నారులు మరియు సిబ్బందితోపాటు దిల్లేష్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జమ్మలమడుగు మోహన గారి బృందం పాల్గొన్నారు. పిల్లలు పెద్దలు భోగిమంటలు వేసి ఆటపాటలతో నృత్యాలతో ఆనందించారు.
సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం మన భారతదేశము కాగా నేటి భావితరానికి సంస్కృతి సంప్రదాయాన్ని మన పండగలను తెలియ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని భారతీయ పండుగలను పిల్లలకు వారి భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్సిందిగా చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు ఎంపీ ఆనంద గారు అభిలాషించారు