Republic Day Celebration’s
స్థానిక చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నడపబడుతున్న ముత్తు ఆంగ్ల మధ్య పాఠశాల ఆవరణంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమృత హాస్పిటల్ అధినేత ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మనం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మన దేశం స్వతంత్ర గణతంత్ర దేశంగా అవతరించిన చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకోవడానికి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, దేశానికి సొంత రాజ్యాంగం లేదని, బదులుగా బ్రిటిష్ వారు అమలు చేసిన చట్టాల ప్రకారం భారతదేశం పాలించబడేదన్నారు. అయితే అనేక చర్చలు మరియు సవరణల అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ భారత రాజ్యాంగం యొక్క ముసాయిదాను సమర్పించిందని, ఇది నవంబర్ 26, 1949 న ఆమోదించబడి అధికారికంగా 26 జనవరి 1950 నుండి అమలులోకి వచ్చిందన్నారు. అనంతరం ముత్తు ఆంగ్ల మాధ్యమ పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల చేపట్టిన పలు సాంస్కృతి కార్యకలాపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఈ వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.పి. ఆనందన్, సెక్రెటరీ కవిత రాణి, డాక్టర్ జి.వి.ఎస్ బాబు, మేనేజర్ కృష్ణ చరణ్, కోశాధికారి పట్నం గిరిజం మాల్, గుడ్విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ కుమార్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి, వాసవి క్లబ్ కార్యవర్గ సభ్యులు నరేంద్ర కుమార్, బి.ఎ.క్రాంతి రేఖ, రాజేష్, బీటీ కళాశాల కరస్పాండెంట్ మునిరత్నం, బీరంగి రేవతి, అన్నమయ్య జిల్లా సాంస్కృతిక శాఖా జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, గ్రామ జ్యోతి సొసైటీ సుభద్ర, అమ్మ సర్వీస్ సొసైటీ ఫౌండర్ సుబ్రహ్మణ్యం, వివేకానంద ఆశయం ఫౌండేషన్ సభ్యులు గుంపు భాను ప్రకాష్, మల్లికార్జున, జనార్దన్, ఈఫేస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు వి.ఎస్ రెడ్డి తదితర స్థానిక స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comment (1)
A. Kavitha Rani
You are doing nice services…. Keep it up